అవినాశ్‌రెడ్డి, సీఎం జగన్ ద్వారా నాకు ఆపద ఉందని గతంలో చెప్పా. ఈ పొద్దిటికీ ఉంది. నేను వైఎస్ కుటుంబానికి, ఎవరికీ భయపడను.. ఎక్కడికీ పారిపోను అని వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... దస్తగిరి అనే వ్యక్తి వాంగ్మూలం ఎప్పటికీ మార్చలేరు. ఆ రోజు మేజిస్ట్రేట్ ముందు ఏం చెప్పానో ఈ రోజూ అదే చెబుతాను. సమస్య తమపైకి రావడంతో వారంతా సీబీఐపై అన్యాయమని, అక్రమమని మాట్లాడుతున్నారు. 300 మంది వాంగ్మూలం తీసుకున్నారు. వారందరినీ ఎందుకు టార్గెట్ చేయలేదు? నన్నే ఎందుకు చేశారంటే ఆధారాలున్నాయి కాబట్టే. జగన్ ఢిల్లీకి వెళ్లి మోదీతో కీ రోల్ చేస్తారని అనుకుంటున్నారేమో.. అవన్నీ అక్కడ కుదరవు. ఆంధ్రప్రదేశ్‌లో రాక్షస పాలన జరుగుతోందని ప్రధాని మోదీ కూడా చెప్పారు. వాళ్ల పార్టీ అధికారంలో ఉందికదా అని సీబీఐవారికి సపోర్టు చేయదు. న్యాయం ఎలా ఉంటే అలానే చేస్తుంది. న్యాయం గెల్చాల. ప్రజలు ఇంత కిరాతకమైన పార్టీ పోవాలని కోరుకుంటున్నారు’ అని తెలిపారు.