‘‘వివేకా హత్య కేసులో నిందితులను కాపాడటానికి ఢిల్లీ చుట్టూ తిరిగిన జగన్‌రెడ్డి దాని వల్ల ఫలితం లేదని ఇప్పుడు లాబీయిస్టులను ఆశ్రయించారు. వాస్తు శాస్త్రం, హస్త సాముద్రికంలో పట్టు ఉన్న విజయ్‌కుమార్‌కు కొంతమంది పెద్దలతో మంచి పరిచయాలు ఉన్నాయి. ఆయనను ముఖ్యమంత్రి ప్రత్యేక విమానంలో తాడేపల్లికి ఆదివారం పిలిపించారు. మైసూర్ నుంచి ప్రత్యేక విమానంలో తాడేపల్లికి వచ్చిన లాబీయిస్టు విజయ్‌కుమార్‌తో ఏం చర్చించారో సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి’’ అని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య డిమాండ్ చేశారు. మైసూర్ నుంచి ఈ విమానంలో ప్రముఖ తెలుగు కంట్రాక్టర్ చింతా శశిధర్, హెచ్‌పీ బసవరాజు, సతీశ్‌లతో కలిసి ఆయన గన్నవరం విమానాశ్రయంలో దిగారు. అక్కడ నుండి నేరుగా తాడేపల్లి సీఎం జగన్ ఇంటికి వెళ్లడం దేనికి సంకేతం అని అయన ప్రశ్నించారు.