టీడీపీ యువనేత నారా లోకేష్ నేడు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా నేడు పల్లె దొడ్డిలో మహిళలు లోకేష్‌ని కలిశారు. గ్రామంలో రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ పట్టించుకునే వారు లేరని వాపోయారు. తాగునీటి సమస్య కూడా ఉందని గ్రామస్థులు తెలియజేసారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... టీడీపీ హయాంలో గ్రామాల్లో 25 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు వేశామన్నారు. ఇప్పుడు జగన్ పంచాయతీ నిధులు కాజేసి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ గ్రామంలో ఉన్న తాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు.