దక్షిణ పసిఫిక్‌లోని ద్వీప దేశమైన ఫిజీలో మంగళవారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 6.3గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) వెల్లడించింది. మంగళవారం ఉదయం 10.01 గంటల సమయంలో 22.42 వెడల్పు, 179.26 పొడవు, 569 కి.మీ లోతులో ఫిజీ రాజధాని సువాకు 485 కి.మీ దూరంలో ఈ భూకంపం సంభవించినట్లు ఎన్‌సీఎస్ ట్వీట్ చేసింది. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని సిస్మోలజీ సెంటర్ పేర్కొంది.