ఏపీలో రైతులకు శుభవార్త. రైతులకు అవసరమయ్యే అన్ని హైబ్రిడ్, ప్రీమియం రకాల మిర్చి విత్తనాలు.. వ్యవసాయ, ఉద్యాన శాఖల సమన్వయంతో అందుబాటు ధరల్లో ఉంచుతామన్నారు వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ తెలిపారు. మిర్చి విత్తనాల వ్యాపారులతో ఏపీ సీడ్స్ ద్వారా ఒప్పందం కుదుర్చుకుని ఆర్‌బీకేల్లో అందుబాటులో ఉంచడానికి చర్యలు చేపట్టామని తెలిపారు. అంతర్గత తనిఖీ బృందాలను కూడా నియమించామన్నారు. ఒకవేళ ఎవరైనా మిర్చి విత్తనాలను అధిక ధరలకు అమ్మితే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2022-23లో మిరపలో రికార్డు స్థాయి దిగుబడి లభించడంతో పాటు మంచి ధర పలకిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఆదాయం సమకూరిందని.. అందుకే వచ్చే ఖరీఫ్‌లో అధిక విస్తీర్ణంలో మిరప సాగుకు అవకాశం ఉంది అన్నారు. మిరప అధికంగా పండించే జిల్లాల వ్యవసాయాధికారులు, విత్తన కంపెనీల ప్రతినిధులతో సమీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఏపీ సీడ్ యాక్టు కింద 35 విత్తన కంపెనీలతో ఏపీ సీడ్స్ ఎంవోయూ చేసుకున్నారు.
మరోవైపు కల్తీ విత్తనాలు, నకిలీ విత్తనాలు, కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించే డీలర్లు, వ్యాపారుల ఆగడాలకు చెక్ పెట్టేందుకు టాస్క్‌ఫోర్స్ టీంలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్సులు కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు అధికారులు. ఏపీలో మిరప విత్తనాల ధరలకు రెక్కలొచ్చాయి. కిలో విత్తనాల ధర రికార్డు స్థాయిలో పలుకుతోంది. అడ్వాన్స్ బుకింగ్ అంటూ రేట్లు పెంచేశారు.. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈసారి మిర్చి పంటను వేసేందుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు.. దీంతో విత్తనాల ధరలు పెరిగిపోయాయి. విత్తనాల ధరలపై నియంత్రణ చేయాలంటూ అన్నదాతలు కోరారు. దీంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా వాటిని అందుబాటులోకి తెస్తున్నారు.
మరోవైపు ఆర్బీకేల ద్వారా రైతులకు అవసరమైన పురుగు మందులను పంపిణీ చేయనున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆర్‌బీకేల ద్వారా రైతులకు వచ్చే ఖరీఫ్ సీజన్‌లో అవసరమైన పురుగు మందుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే భూసార పరీక్షల ద్వారా ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి గ్రామంలో మట్టి నమూనాలు సేకరిస్తున్నారు. ఇటు వైఎస్సార్ యంత్ర సేవా పథఖాలకు సంబంధించిన ప్రక్రియ కూడా జరుగుతోంది. రైతు భరోసాకు సంబంధించి అర్హులైన రైతులు ఈ నెలాఖరులోగా ఈకేవైసీ చేయించుకోవాలని అధికారులు సూచించారు.
ఇటు రబీ సీజన్‌లో పండించిన ధాన్యం కొనుగోళ్ల కోసం ఆర్బీకేల్లో కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాలను రైతులు సంప్రదించి.. అక్కడి వ్యవసాయ అధికారుల సలహాతో పండించిన ధాన్యానికి ప్రభుత్వం ద్వారా మద్దతు ధర అందజేస్తారు. ఆర్బీకేల్లో వీఏఏ, వీఆర్‌వో, వీహెచ్‌ఏ లను, వ్యవసాయాధికారి, తహశీల్దార్‌ను సంప్రదించాలని సూచించారు.