రంజాన్ మాసం సందర్భంగా జరిగిన ఓ ఇఫ్తార్ విందులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఇదిలావుంటే కడప జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఇవాళ కడపలో టీడీపీ జోన్-5 సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు... ఆ సమావేశం ముగిసిన తర్వాత కడప పెద్ద దర్గాకు తరలి వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ముస్లింలతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్.శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను టీడీపీ స్థానిక విభాగాలు సోషల్ మీడియాలో పంచుకున్నాయి. ఈ ఇఫ్తార్ విందు సందర్భంగా చంద్రబాబు ముస్లిం వేషధారణలో కనిపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa