ట్విట్టర్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ వాడే సామాజిక మీడియా సాధనం. ఇదిలావుంటే టీడీపీ అధినేత చంద్రబాబు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఆయన తాజాగా ట్విట్టర్‌లో మరో మైలురాయిని అందుకున్నారు. బాబు తన ట్విట్టర్ అకౌంట్‌లో 5 మిలియన్ల (50 లక్షల మంది) ఫాలోవర్ల మార్క్‌ను దాటారు. ఈ విషయాన్ని టీడీపీ రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ప్రస్తావించారు. 'మా బాస్‌కు 5 మిలియన్ ఫాలోవర్లు' వచ్చారంటూ అభినందనలు తెలిపారు. అలాగే తెలుగు తమ్ముళ్లు కూడా ఖుషీలో ఉన్నారు. తమ పార్టీ అధినేత ఏకంగా 5 మిలియన్ల ఫాలోవర్ల అభిమానాన్ని సంపాదించారంటూ సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు చంద్రబాబు తన బర్త్ డేకు ముందు ఈ ఫీట్ అందుకున్నారు.
ఇక ఏపీలో రాజకీయంగా చూస్తే.. ముఖ్య నేతల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 5.3 మిలియన్ ఫాలోవర్లతో టాప్‌లో ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు రెండో ప్లేసులో 5 మిలియన్ల ఫాలోవర్లను అందుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు 2.5 మిలియన్ల ఫాలోవర్లతో మూడో స్థానంలో ఉన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) 1 మిలియన్‌కు దగ్గరలో ఉన్నారు. ట్విట్టర్ సంగతి అలా ఉంటే.. ఫేస్‌బుక్‌లో మాత్రం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టాప్‌లో 2.1 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. రెండో స్థానంలో నారా లోకేష్. 2 మిలియన్.. మూడో ప్లేస్‌లో చంద్రబాబు 1.8 మిలియన్ ఉంటే.. పవన్ కళ్యాణ్ ఒక మిలియన్‌కు దగ్గరగా ఉన్నారు.
మరోవైపు పార్టీల వారీగా ట్విట్టర్ ఫాలోవర్లు చూస్తే జనసేన పార్టీ 2 మిలియన్ల ఫాలోవర్లతో మొదటి స్థానంలో ఉంది.. వైఎస్సార్‌సీపీ మిలియన్‌గా దగ్గర ఉంది.. టీడీపీ ఆఫ్ మిలియన్ దాటేసింది. పార్టీల వారీగా ఫేస్‌బుక్ ఫాలోవర్లు ఇలా ఉన్నారు. టీడీపీ టాప్‌లో 4.1 ఫాలోవర్లతో దూసుకుపతోంది. ఆ తర్వాత జనసేన పార్టీకి 1.7 ఫాలోవర్లు ఉంటే.. వైఎస్సార్‌సీపీ మాత్రం 1.2 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫేస్‌బుక్ ఫాలోవర్లలో టాప్‌లో ఉండటం విశేషం. ఇక పార్టీల వారీగా ఫేస్‌బుక్‌లో టీడీపీ టాప్‌లో ఉంటే.. ట్విట్టర్‌లో జనసేన పార్టీకి ఫాలోవర్లు ఎక్కువమంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ఫాలోవర్లలో టాప్‌లో ఉండటానికి కారణాలు లేకపోలేదు. ఆయన అటు సినిమాలతో పాటూ రాజకీయాల్లో ఉండటంతో ఫోలోయింగ్ పెరిగింది. ఫేస్‌బుక్‌లో మాత్రం కాస్త వెనుకబడి ఉన్నారు.