ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువగళం యాత్రలో ఆసక్తికర సన్నివేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 19, 2023, 08:53 PM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  యువగళం పాదయాత్రలో ఆసక్తికర ఘటన చోటు చేసుకొంది. ఇదిలావుంటే నారా లోకేష్ యాత్ర కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఉదయం పుప్పలదొడ్డిలో పాదయాత్ర కొనసాగుతుండగా ఆసక్తికర సీన్ కనిపించింది. ఈ క్రమంలో ఓ బాలుడు టీడీపీ నేతల ఫోటోలతో ఉన్న పసుపురంగు టీషర్టు వేసుకుని లోకేష్‌తో పాటూ అడుగులు వేశాడు. కొద్దిసేపటికి గమనించిన లోకేష్ పిల్లవాడిని దగ్గరకు పిలిచి మాట్లాడారు.. అప్యాయంగా పలకరించారు. ఈ వయసులో రాజకీయాలు ఎందుకు అంటూ బాలుడి ఒంటిపై ఉన్న టీషర్టును లాగి పక్కనున్న వాళ్లకు ఇచ్చారు. రాజకీయాలు కాదు ముందు మంచిగా చదువుకోవాలని చెప్పారు లోకేష్. బాలుడ్ని అక్కడి నుంచి పంపించేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లోకేష్ బాలుడ్ని పిలిచి టీ షర్ట్ లాగేయడంతో టీడీపీ నేతలు ఒకింత అవాక్కయ్యారు.. తర్వాత ఏం జరిగిందో తెలియడంతో నవ్వుకున్నారు.


మరోవైపు నారా లోకేష్ పాదయాత్ర 75వ రోజుకు చేరింది. ఆలూరు నియోజకవర్గంలో కొనసాగుతండగా.. చిరుమాను దొడ్డికి చెందిన ఖాసింబీ లోకేష్‌ను కలిసి తన కష్టం చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకుంది. గత నెల 31న తన భర్త రైతు రంజన్ ఆత్మహత్య చేసుకున్నాడని.. రూ.9 లక్షల వరకు అప్పుల పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ డబ్బులకు వడ్డీలు కట్టలేని పరిస్థితి లేకపోవడంతో తన భర్త పొలంలోనే పురుగుల మందుతాగి ప్రాణాలు తీసుకున్నట్లు చెప్పింది. గత రెండేళ్లుగా నకిలీ విత్తనాలు, పురుగుల మందులతో పంటనష్టం వచ్చిందని చెప్పారు.


తన భర్త చనిపోయినా సరే అప్పుల వాళ్ల నుంచి ఒత్తిడి కొనసాగుతోంది.. తాను వెళ్లి కలెక్టర్‌కు తన కష్టాన్ని చెప్పి మొరపెట్టుకున్నాను అన్నారు ఖాసింబీ. ఇప్పటి వరకు తనకు న్యాయం జరగలేదని.. సాయం చేయమని లోకేష్‌ను ఆమె కోరింది. వెంటనే స్పందించిన లోకేష్.. ఖాసింబీ కుటుంబానికి పరిహారం కోసం ప్రభుత్వానికి లేఖరాసి పరిహారం అందేలా కృషిచేస్తామని చెప్పారు. ఈ పాలనలో వ్యవసాయరంగం పూర్తిగా సంక్షోభంలో ఉందని.. రైతు ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉందన్నారు. దీనికి ఖాసింబీ కుటుంబమే ఉదాహరణగా చెప్పారు.


అంతకముందు వలగొండ క్రాస్ క్యాంప్ సైట్ నుంచి నారా లోకేష్ పాదయాత్రను ప్రారంభమైంది. లోకేష్‌ పార్టీ నేతలతో కలిసి స్థానిక మహిళలు, యువతతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే కొందరు స్థానికులు లోకేష్‌ను కలిసి తమ ఇబ్బందుల్ని చెప్పుకున్నారు. మంగళవారం జరిగిన సభలో లోకేష్ మంత్రి గుమ్మనూరు జయరాంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బెంజ్ మంత్రి అంటూ టార్గెట్ చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com