కర్ణాటక విధానసభ ఎన్నికల్లో యాదగిరి పట్టణానికి చెందిన యంకప్ప అనే యాచకుడు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. గురువారం ఇందుకు భిక్షాటనతో పోగు చేసిన రూ.10 వేలను డిపాజిట్‌గా చెల్లించి, నామపత్రం సమర్పించారు. డిపాజిట్‌కు కావాల్సిన డబ్బు కోసం యాదగిరి నియోజకవర్గంలో తిరుగుతూ యాచించి అలా సేకరించిన నాణేలనే గురువారం ఎన్నికల అధికారికి ఇచ్చారు.