నరసరావుపేట మండలం రావిపాడు గ్రామంలో గురువారం కౌలు రైతు ఆత్మహత్య కు పాల్పడ్డాడు. ఈ ఘటనపై వివరాల్లోకి వెళితే.. ఆముదాల శ్రీనివాసరావు (31)అనే యువకుడు తనకున్న ఎకరంతో పాటు మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి, పత్తి, మొక్కజొన్న సాగు చేశాడు. రెండేళ్లు వరుస నష్టాలతో పాటు పత్తికి పురుగు సోకి దెబ్బ తినడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఇ. బాల నాగిరెడ్డి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa