తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ విద్యావేత్త, రాజంపేట నియోజకవర్గ సీనియర్ నాయకులు జగన్ రాజు రాజంపేటలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ప్రతి రంజాన్ పండుగ నాడు చౌక దుకాణాల ద్వారా ముస్లింలకు రంజాన్ తోఫా అందజేసేవారని పేర్కొన్నారు. వైసిపి ప్రభుత్వంలో సంతోషంగా పండుగ జరుపుకునేందుకు కూడా లేకుండా రంజాన్ తోఫా రద్దు చేశారని విచారణ వ్యక్తం అయన చేశారు.
ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట సీనియర్ నాయకులు, మాజీ కల్లుగీత కార్మిక రాష్ట్ర డైరెక్టర్ కొమరా వెంకట నరసయ్య, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి సమ్మెట శివప్రసాద్, ఒంటిమిట్ట మాజీ ఎంపీపీ లక్ష్మీనారాయణ నాయుడు, సిద్ధవటం మాజీ జెడ్పిటిసి చలమయ్య యాదవ్, టిఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షులు పోలి శివకుమార్, నియోజకవర్గ తెలుగు యువత నాయకులు తోట శివశంకర్, శివారెడ్డి పివి రమణ, రాజంపేట టిడిపి ఉపాధ్యక్షులు సతీష్ రాజు, సీనియర్ నాయకులు జీ. వి సుబ్బరాజు, సిద్ధవటం బీసీ నాయకులు గాలి సుబ్బయ్య, తాళ్లపాక అంజన్ రాజు, విజయ్ కుమార్ నాయుడు, బ్రాహ్మణపల్లి సాంబశివ నాయుడు, రామారావు నాయుడు, వెంకటేష్ యాదవ్, గురు నాయుడు, పార్లమెంట్ ముస్లిం మైనారిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మండెం కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.