సత్తెనపల్లి పట్టణంలోని తాలూకా సెంటర్లో శుక్రవారం సాయంత్రం 4: 00 గంటలకు పల్లపు సత్తెన్న విగ్రహవిష్కరణ జరుగుతుందని నియోజకవర్గ వడ్డెర సంక్షేమ సంఘం నాయకులు గురువారం తెలిపారు. రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు చంద్రగిరి ఏసురత్నం, మర్రి రాజశేఖర్ తదితరులు పాల్గొంటారన్నారు.