చిత్తూరు జిల్లాలో జగనన్న భూహక్కు- భూ రక్షలో భాగంగా మొదటి విడత రీ సర్వేపూర్తయిన గ్రామాలలో సర్వే రాళ్ళు నాటే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని, రెండో విడత రీ సర్వేలో గ్రౌండ్ ట్రూధింగ్, గ్రౌండ్ వాల్యుయేషన్, భూ హక్కుపత్రాలుఅందజేయడం ప్రణాళిక బద్ధంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ సగిలి సన్మోహన్ తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సచివాలయం సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమా నికి అధికప్రాధాన్యత ఇస్తున్నదని, స్పందన కార్య క్రమంలో అందే అర్జీలను సకాలంలో పరిష్కరించాలని, అర్జీదారులకు సరైన ఎండార్స్మెంట్ఇవ్వాలని ఈ అంశంపై ఉన్నత స్థాయిలో అధికారులు తరచూ సమీక్షించడంజరుగుతున్నదని, ఏ అర్జీ బియాండ్ ఎస్ఎల్ఎ కి వెళ్లకుండా చూడాలన్నారు.