నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమానికి సంబంధించి జిల్లా లో 74, 319 ఇండ్లు మంజూరు కాగా 24, 596ఇండ్లు లేఔట్లలో, 49, 723 సొంత స్థలాలలో కలవని ఇందులో మొత్తం 65, 517 ఇండ్లు గ్రౌండ్ కావడం జరిగిందని, గ్రౌండింగ్ కి సంబంధించి బిబిఎల్ నుంచి బిఎల్, బిఎల్ నుండి ఆర్ ఎల్, ఆర్ ఎల్ నుండి ఆర్ సి కి చేరుకునేలా స్టేజ్ కన్వెన్షన్ కచ్చితంగా జరగాలని జిల్లా కలెక్టర్ సగిలి సన్మోహన్ జిల్లా అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సచివాలయం సమావేశపు మందిరంలో జిల్లా అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న కాలనీలలో మౌలిక వసతులైన నీటిసౌకర్యం, విద్యుత్ సౌకర్యం, అంతర్గత రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ తదితర అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
ఇంకా ఇండ్లనిర్మాణం మొదలు పెట్టని లబ్ధి దారులకుఅవసరమైన ఆర్థిక సాయం స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలను అందించాలన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అర్హులైన వారందరికీ జాబ్ కార్డులు మంజూరు చేయాలని, వంద రోజులుపనిదినాలను కల్పించాలని, స్వామిత్వకార్యక్రమం ను వేగవంతం చేయాలన్నారు. పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖల ద్వారా ప్రజల కు అందించే సేవలను విస్తృతం చేయాలన్నారు.