చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలోని రెండు దేవాలయాల పునరుద్ధర ణకు ప్రముఖ పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ రూ. 2 లక్షల విరాళాన్ని అందజేశారు. శుక్రవారం మండలంలోని కంగా నెల్లూరులో సీతారామ స్వామి ఆలయం, పూజగానిపల్లి ఆలయ అభివృద్ధి పనులకు ఆర్థిక సహాయం అందించారు. ఈ నిధులను ఆయా ఆలయ కమిటీ సభ్యులకు ఆర్సిపై టీం అందజేసారు.