పొన్నూరు నియోజకవర్గంలోని ముస్లిం సోదర సోదరీమణులకు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరి చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నిష్టతో ఉపవాస దీక్షను చేసిన ప్రతి ఒక్కరికి అల్లా కృప కలగాలని ప్రతి కుటుంబ సుఖసంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. రంజాన్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకొని అల్లా ఆశీస్సులు పొందాలని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.