తిరుపతి ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు చంద్రగిరి కోటలో నైట్ స్కై అబ్జర్వేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు సైన్స్ సెంటర్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్రీనివాస నెహ్రూ శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. శని, ఆదివారాల్లో రాత్రి 7 నుంచి 9 గంటల వరకు నిర్వహించే స్కై అబ్జర్వేషన్లో భాగంగా టెలిస్కోపుల ద్వారా గ్రహాలు, చంద్రుడు, నక్షత్రాలు, ఇతర ఖగోళ వస్తువులను పరిశీలించే అవకాశం కల్పిస్తున్నట్టు ఆయన చెప్పారు.