గుంటూరు-బనార్‌సల మధ్య ఆరు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను సామర్లకోట జంక్షన్ స్టేషన్ మీదుగా నడుపుతున్నట్టు సామర్లకోట రైల్వే ఉన్నతాధికారి శుక్రవారం సాయంత్రం తెలిపారు. గంగా పుష్కరాలకు ఈ ప్రాంతాల నుంచి తరలివెళ్లే భక్తుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక రైళ్లను రైల్వే నడుపుతున్నారు. 07230 నంబరు గల ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు గుంటూరు నుంచి బనారస్ వరకూ నడువనుండగా ఏప్రిల్ 22, 29 తేదీల్లో, మే 6వ తేదీన శనివారం రాత్రి 11.45 గంటలకు బయలుదేరి విజయవాడ, గుడివాడ, కైకలూరు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమహేంద్రవరం మీదుగా సామర్లకోటకు ఆదివారం ఉదయం 7.55 గంటలకు చేరి, బనార్‌సకు సోమవారం సాయంత్రం 4.30 గంటలకు చేరుతుంది. ఇక 07229 నంబరు గల ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు బనార్‌స-గుంటూరు మధ్య నడుపనుండగా ఏప్రిల్ 24, మే 1, 8 తేదీల్లో సోమవారం రాత్రి 6 గంటలకు బనార్‌సలో బయలుదేరి, సామర్లకోటకు మంగళవారం రాత్రి 10.43 గంటలకు చేరుతుంది. రాజమహేంద్రవరం, నిడదవోలు, తణుకు, భీమవరం, కైకలూరు, గుడివాడ, విజయవాడల మీదుగా గుం టూరుకు బుధవారం ఉదయం 6.30 గంటలకు చేరుతుంది. ఆయా నిర్దేశించి ఆరు రోజుల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. గుంటూరు-బనార్‌స మధ్య 4 వేల కిలోమీటర్ల దూరాన్ని 96 గంటల్లో ఈ రైళ్లు చేర తాయి. ఈ రైళలో 22 ఎల్‌హెచ్‌బీ బోగీలతో నడుపనున్నారు. ఈ ప్రత్యే క ఎక్స్‌ప్రెస్ రైళ్లలో రిజర్వేషన్ టిక్కెట్ల కోసం నిర్దేశించిన రైల్వే స్టేషన్లలో రిజర్వేషన్ కౌంటర్‌ల వద్ద సంప్రదించాలని అధికారులు తెలిపారు.