ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్ల దాడి ఘటనపై మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు జరుగుతాయి అని ముందే పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. దళితులను లోకేష్ అవమానించారని అసత్య ఆరోపణలతో మంత్రి ఆదిమూలపు సురేష్ తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని వీధి రౌడీల ప్రవర్తించారని మండిపడ్డారు. తక్షణమే మంత్రి పదవి నుంచి సురేష్‌ను గవర్నర్ బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.