టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర భవిష్యత్ తరాల్లో ఒక చరిత్రగా నిలవబోతోందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు. లోకేష్ ప్రజా అభివృద్ధి కోసం ఎంతో సంకల్పబలంతో వేయి మైళ్లను అవలీలగా నడవగలిగారన్నారు. వైసీపీ ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తూనే ఉందన్నారు. మొక్కవోని దీక్షతో.. ఓపిక, సహనంతో, శాంతి సామరస్యంతో ప్రజా సమస్యలను వింటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ లోకేష్ ముందుకు సాగుతున్నారని దేవతోటి కొనియాడారు.