గన్నవరం నియోజకవర్గానికి ఎవరిని ఇన్‌చార్జ్‌గా నియమించాలి.. అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలన్నది టీడీపీ అధినేత చంద్రబాబు చూసుకుంటారని టీడీపీ సీనియర్ నేత దేవినేని అపర్ణ అన్నారు. గన్నవరంలో టీడీపీ జెండా ఎగురేయడమే లక్ష్యమన్నారు. నారా లోకేష్ యువగళం పాద యాత్ర 1000 కిలోమీటర్లకు చేరుకున్న సందర్భంగా నియోజకవర్గంలోని మసీదులు, చర్చిలు, దేవాలయాలకు వాటర్ కూలర్ల పంపిణీ దేవినేని అపర్ణ ఆధ్వర్యంలో రామవరప్పాడు రింగ్‌రోడ్డు వద్ద ఉన్న ఇన్నోటల్ హోటల్లో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను పుట్టింది.. పెరిగింది.. చదివిందీ అన్నీ గన్నవరంలోనేనన్నారు. త ర్వాత మెట్టినిల్లు విజయవాడ వచ్చానన్నారు. ఈ సం దర్భంగా ఆమెను గన్నవరం నుంచి పోటీ చేస్తారా అని మీడియా ప్రతినిధులు అడగ్గా అవును.. ఆ ఆలోచన ఉంది.. అడుగు ముందుకు వేస్తున్నానంటూ సమాధానం చెప్పారు. బందరు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని చంద్రశేఖర్ (చందు), టీడీపీ వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి గూడవల్లి నరసయ్య, టీడీ పీ సీనియర్ నేతలు బొప్పన హరికృష్ణ, పోకా కిరణ్ కుమార్, కోనేరు నాని, దండు సుబ్రహ్మణ్యరాజు, అద్దేపల్లి సాంబశివరావు (సాంబు), రూరల్ మండల తె లుగు యువత అధ్యక్షుడు గంపా శ్రీనివాస యాదవ్, బొమ్మసాని అరుణకుమారి, గుజ్జర్లపూడి బాబూరావు, పట్టపు వెంకటేశ ్వరరావు (చంటి), పార్థనా మందిరాల పాస్టర్లు, మసీదు పెద్దలు పాల్గొన్నారు.