వ్యవసాయ రంగాన్ని లాభదాయకంగా చేసి మరింతగా ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కన్వీనర్ గా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, అతిథులుగా జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, పి కే యం వు డా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ లు పాల్గొన్నారు.
జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ గతంలో తమిళనాడు నుంచి ఇతర ప్రాంతాలలో వేరుశనగ విత్తన కాయలు కొనుగోలు చేయడం వల్ల కొంత నాణ్యత దెబ్బతినిందని ఈ ఏడాది ముందుగానే ఈ కార్యక్రమం ప్రారంభించాలని అన్నారు. మిట్ట ప్రాంతంలో ప్రధానంగా అటవీ ప్రాంతాల్లో అటవీ జంతువుల వల్ల నష్ట నివారణ చర్యలు ముందుగానే చేపట్టాలని అన్నారు. మామిడి పంట అందరూ ఒక్కసారిగా ఆత్రపడి హార్వెస్టింగ్ చేయకుండా వివిధ దశలలో చేస్తే మంచి ధరలు లభిస్తాయి అని అన్నారు.