తన అభిమాన హీరో కోసం ఫ్రెండ్‌ని చంపేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన తణుకులో జరిగింది. ఏలూరుకు చెందిన హరికుమార్, కిషోర్ స్నేహితులు. హరి, ప్రభాస్ అభిమానుల సంఘానికి కార్యదర్శిగా పని చేస్తుండటంతో ఆయన వీడియోను వాట్సప్ స్టేటస్‌గా ఉంచుకున్నాడు. దీనికి కిషోర్ ప్రభాస్‌ని తిడుతూ పవన్ కల్యాణ్ వీడియోలను స్టేటస్‌గా పెట్టుకోవాలని సూచించాడు. ఇద్దరూ మద్యం మత్తులో గొడవపడ్డారు. ఈక్రమంలో హరి.. కిషోర్‌ను కర్రతో తలపై బలంగా కొట్టి, సిమెంటు రాయితో మొహంపై మోది చంపేశాడు.