అమెరికా ప్రభుత్వం భారతీయులకు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది 10 లక్షలకు పైగా భారతీయులకు వీసాలు జారీ చేయాలని నిర్ణయించింది. అలాగే హెచ్-1బీ, ఎల్1 వీసాల జారీకి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపింది. ఈ నిర్ణయం రెండు దేశాల ఆర్థిక వ్యవస్థనలు బలోపేతం కావడానికి ఉపయోగపడుతుందని అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి డొనాల్డ్ లూ తెలిపారు. కాగా, వృత్తి నిపుణుల కోసం అమెరికా భారీగా వీసాలు జారీ చేస్తున్న విషయం తెలిసిందే.