హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోరం జరిగింది. మహోబా జిల్లా ఖుర్ద్‌లో నివసిస్తున్న వీరేంద్ర (58).. అతడి కుమారులు దేవేంద్ర (28), చంద్ర ప్రకాష్ (23) ఓ బావిని శుభ్రం చేసి మోటారు బిగించేందుకు అందులో దిగారు. ఎంతసేపటికీ బయటకి రాకపోవటంతో వీరేంద్ర అన్న రామ్ కరణ్ గ్రామస్థులతో కలిసి బావిలోకి దిగారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ముగ్గురిని వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.