ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలను రెండ్రోజులుగా వర్షపు జల్లలు పలకరిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, మరికొన్ని చోట్ల వానలు పడుతున్నాయి. కాగా ద్రోణి ప్రభావంతో మరో 2రోజులు ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వానలు పడే అవకాశముందని పేర్కొంది. అటు తెలంగాణలోనూ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముంది.