ఖలిస్తాన్ మద్దతుదారు, మత ప్రబోధకుడు అమృత్పాల్ సింగ్ ఎట్టకేలకు తలొగ్గాడు. పోలీసులను ముప్పతిప్పలు పెట్టించిన అతడు పంజాబ్లోని మోగా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. గత కొన్ని రోజులుగా అమృత్ పాల్ పరారీలో ఉన్నాడు. సోషల్ మీడియా ద్వారా పలు వీడియోలు విడుదల చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతూ వచ్చాడు. ఈక్రమంలో పోలీసులు విస్తృత సోదాలు జరపటంతో ఎటూ పోలేక అతడే స్వయంగా వచ్చి లొంగిపోయాడు.