దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా ఆదివాసీలకు ఆకలి కేకలు తప్పడం లేదు. తాజాగా రేషన్ బియ్యం ఇవ్వాలంటూ ఆదివాసీలు ఆందోళన నిర్వహించిన ఘటన ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లాలో జరిగింది. రావికవతః(మ) కడగడ్డ గ్రామంలోని ఆదివాసీలు తమకు మూడు నెలలుగా రేషన్ బియ్యం ఇవ్వడం లేదంటూ నోట్లో ఆకులు పెట్టుకొని, చేతిలో కంచాలతో నిరసన చేపట్టారు. రేషన్ బియ్యం వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.