ప్రస్తుత ఆధునిక సమాజంలో చాలా మంది డయాబెటిస్, హైబీపీలతో బాధపడుతున్నారు. మనం తీసుకునే ఆహారంతోనే వీటి నుంచి మనకు ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా పిస్తాలను రోజూ తగు మోతాదులో తీసుకుంటే అద్భుత ప్రయోజనాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ప్రొటీన్లు, ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. హైబీపీని తగ్గించడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలోనూ పిస్తాలు ఉపయోగపడతాయి.