ప్రపంచ దేశాలలో ఆతి విలువైన భారత రాజ్యాంగానికి అడుగడుగునా తూట్లు పొడుస్తున్న వైకాపా ప్రభుత్వ పెద్దలపై తగిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పెందుర్తి నియోజకవర్గం పరిశీలకులు గంటా నూకరాజు డిమాండ్ చేసారు. రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పై వైకాపా రౌడీమూకలు రాళ్ళదాడి చేయడం ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని గంటా నూకరాజు అన్నారు. రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం యర్రగొండపాలెంలో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడుపై ఈ విధమైన దాడులు చేయడం, అదీకూడా రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ కనుసన్నల్లో జరగడం సిగ్గుచేటని అన్నారు. పధకం ప్రకారమే ఇటువంటి చర్యకు పాల్పడ్డారని అన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఎన్ఐఏ భద్రతలో ఉన్న చంద్రబాబుపై దాడులు చేయడం దేనికి సంకేతమని అన్నారు. ఏకంగా రాష్ట్రమంత్రి చొక్కా విప్పుకొని ప్రతిపక్ష నాయకుడి పర్యటనను అడ్డుకోవాలని చేసే ప్రయత్నం యావత్ తెలుగువారిని అవమానం చేసేవిధంగా ఉందని అన్నారు. ప్రజా స్వామ్యాన్ని గౌరవించి, కాపాడవలసిన ప్రజా ప్రతినిధులే ఈవిధమైన దుస్సంఘటనలకు పాల్పడటం సిగ్గుచేటని అన్నారు. బీహార్, అస్సాంల కంటే ప్రమాధాకరమైన రాష్ట్రంగా రాష్ట్రాన్ని తయారు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. రాజకీయ లబ్ధికోసం, మీ పార్టీ నాయకుడి మెప్పుకోసం ఇంతలా దిగజారి చొక్కాలు విప్పుకొని రోడ్డుమీదకు రావలసిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. కోడికత్తి కేసు, వివేకానంద రెడ్డి కేసు విచారణ వేగవంతం కావడం, దోషులు ఎవరని నిర్ధారణకు రావడం, ఇదే విషయమై రాష్ట్రమంతా చర్చ జరుగుతున్న సందర్బంగా ప్రజల ఆలోచనలను దారిమల్లించడానికి చేసే నికృష్ట ప్రయత్నాలే ఇటువంటి నీతిమాలిన చర్యలని గంటా నూకరాజు అభివర్ణించారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రాజ్యాంగ నియమావళిని గౌరవించి పాలన చేయాలని అప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, ప్రజలందరూ హార్సిస్తారని గంటా నూకరాజు ప్రభుత్వానికి సూచించారు.