కనగానపల్లి మండలంలో శనివారం వీచిన ఈదురు గాలులు, వర్షానికి కోత కోసిన వేరుసెనగ పంటతో పాటు కోత దశలో ఉన్న టమోట పంట రైతులకు నష్టాన్ని మిగిల్చింది. మండలంలోని తూంచెర్లకి చెందిన చండ్రాయుడు ఐదు ఎకరాల్లో టమోట పంటను సాగు చేశాడు. అకాల వర్గానికి పంట మొత్తం నేలకు వాలింది. మండల వ్యాప్తంగా కోత కోసిన వేరుసెనగ పంట 120 ఎకరాల్లో తడిచిపోయిందని బాధిత రైతులు వాపోయారు.