ఇండోనేషియాలో భారీ భూకంపం వచ్చింది. ఆదివారం ఉదయం కెపులౌన్ బటులో వరుసగా రెండుసార్లు భూమి కంపించింది. మొదట 6.1 తీవ్రతతో భూకంపం వచ్చిందని, గంటల వ్యవధిలోనే 5.8 తీవ్రతతో మరోసారి భూమి కంపించిందని యూరోపియన్ మెడిటేరియన్ సిస్మోలజికల్ సెంటర్ వెల్లడించింది. మొదటిసారి భూ అంతర్భాగంలో 43 కి.మీ, రెండోసారి 40 కి.మీ లోతులో కదిలకలు వచ్చాయని పేర్కొంది. ఈ ప్రకంపనలతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు.