ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల గురించి ఆలోచించాల్సిన పని లేదని, సాధారణ ఎన్నికలకు ఏడాది కూడా సమయం లేదని, బీజేపీ రాష్ట్ర సహ ఇంచార్జ్ సునీల్ దేవధర్ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కేవలం బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం అని ప్రజలకు చెప్పాలని, వైసీపీ రౌడీయీజం, కుటుంబ పాలనకు చరమగీతం పాడతామని.. బీజేపీ నేతలు, కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లి ఈ విషయాలు చెప్పాలని ఆయన సూచించారు. గుంటూరులో పోయిన వాళ్ల గురించి ఆలోచన వద్దని, తులసి రామచంద్ర ప్రభు వచ్చారన్నారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వంటి పెద్ద నాయకులు బీజేపీలోకి వచ్చారన్నారు.