సింహాచలం అప్పన్న ఆలయంలో చందనోత్సవం వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ రాజీనామా చేయాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి డిమాండ్ చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉత్సవాలు చేశారని మండిపడ్డారు. పొరుగున ఉన్న ఒడిశా భక్తులు సింహాచలానికి అత్యధికంగా వస్తారని.. వారి దగ్గర ఏపీ పరువుపోయిందన్నారు. తెలంగాణా నుంచి ఇంద్రకరణ్ రెడ్డి వచ్చి ఇరుక్కుపోయారని.. దర్శనం అయ్యిందో లేదో తెలీదన్నారు.