ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నం 1పై సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ ముగిసింది. దీనిపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ను ఆశ్రయించాల్సిందిగా పిటిషనర్‌కు సూచించింది. త్వరగా విచారణ ముగించి తీర్పు ఇవ్వాలని ఏపీ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. జీవో నెంబర్ 1పై జనవరి 24న విచారణ ముగించి ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును వాయిదా వేసింది. అప్పటి నుంచి తీర్పు పెండింగ్‌లో ఉన్నట్లు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.