కడప నగర అభివృద్ది కి సంబందించి మంత్రి అంజాద్ భాషకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. అభివృద్ది లేక నిలిచిపోయిన నిర్మాణపనులపై సెల్ఫీ ఫోటోలు తీసుకొని వైసీపీ నాయకులకు ఆయన సవాల్ విసిరారు. టీడీపీ హయాంలో నగరంలో 15 సంవత్సరాలుగా మధ్యలో నిలిచిపోయిన పాత బస్టాండ్ బ్రిడ్జిని తాను పూర్తి చేశానని గుర్తుచేశారు. టీడిపి ప్రభుత్వంలో తాను ఒక ఛాలెంజ్‌గా తీసుకొని పాత బస్టాండ్ బ్రిడ్జిని మూడు నెలలో పూర్తి చేశానని చెప్పారు. నగరంలో భూకబ్జాలు తప్ప ఏమీ చేశావు...? అని ఆయన ప్రశ్నించారు. కడపలో అభివృద్ది చేసి ఉంటే మంత్రి అంజాద్ బాషా సవాల్‌ను స్వీకరించాలన్నారు.