శ్రీకాకుళం రూరల్ పరిధి విశాఖ-ఏ కాలనీకి చెందిన పుల్లేటికుర్తి శివ మరణం కుటుంబంలో విషాదం నింపింది వివరాల్లోకి వెళ్ళితే.... శివ ఈ నెల 21న ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పొన్నాడ వంతెన వద్ద నాగావళి నదిలో ఆదివారం శివ మృతదేహం లభించింది. నదిలోకి దూకి శివ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. శివ మేనమామ పొన్నాడ సుబ్రహ్మణ్యం ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ విజయకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.