ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం జరిగింది. బులంద్‌శహర్ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఓ చిన్నారి తన ఇంటి ఆవరణలో ఆడుకుంటోంది. పొరుగింట్లో ఉన్న ఓ వ్యక్తి ఆమెను మభ్యపెట్టి తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తన విషయం బయటపడుతుందని హత్య చేశాడు. చిన్నారి కుటుంబీకులు నిందితుడి మంచం కింద చిన్నారి రక్తం మడుగులో పడి ఉండటాన్ని చూసి నిర్ఘాంతపోయారు. మద్యం మత్తులో పడి ఉన్న నిందితుడిని పోలీసులకు అప్పగించారు.