కేరళలో తొలి వందేభారత్ ట్రైన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. తిరువనంతపురం నుంచి కాసరగోడ్ మధ్య ఈ రైలు పరుగులు పెట్టనుంది. పదకొండు జిల్లాలను ఈ రైలు కవర్ చేస్తుంది. రెండు రోజుల కేరళ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఇవాళ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్లు ప్రధాని వెంట ఉన్నారు.