ఉత్తర్ప్రదేశ్లో దారుణం జరిగింది. నడవలేని స్థితిలో ఉన్న 85 ఏళ్ల వృద్ధురాలిపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. హమీర్పుర్ జిల్లాలోని బిన్వార్లో ఓ వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తోంది. ఆమె ఇంట్లో చోరీకి వచ్చిన భూర శివరే అనే వ్యక్తి వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె ఎంత బతిమాలినా వినకుండా పాశవికంగా ప్రవర్తించాడు. వృద్ధురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.