తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దు వివాదాలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకోవాలని భారత్, చైనా నిర్ణయించాయి. ఇరు దేశాల మధ్య సైనిక చర్చలు విస్తృతంగా జరిగాయని భారత విదేశీ వ్యవహారాల శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. వాస్తవాధీన రేఖ సమస్యలపై దృష్టిసారించినట్లు వివరించింది. సైనిక, దౌత్య మార్గాల్లో చర్చలను కొనసాగించాలని, ఇరు పక్షాలకూ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం కసరత్తు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది.