భారత రెజ్లర్లు ఇటీవల ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. అయితే ఆయన మీద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. ఈ ఆరోపణలు తీవ్రమైనవేనని పేర్కొంది. దీనిపై ఢిల్లీ పోలీసులు తమ స్పందన తెలియజేయాలని నోటీసులు జారీ చేసింది.