ఉద్యోగాల పేరుతో యువతులపై అత్యాచారాలకు పాల్పడిన కేసులో ఆస్ట్రేలియాలోని భారత సంతతికి చెందిన వ్యక్తిని కోర్టు దోషిగా నిర్ధారించింది. సిడ్నీ చరిత్రలోనే ‘వరస్ట్ రేపిస్ట్’గా బాలేశ్ దన్‌ఖర్‌ను కోర్టు అభివర్ణించింది. ఉద్యోగ ప్రకటనలతో ఐదుగురు కొరియన్ మహిళలకు ఎర వేసి, డ్రగ్స్ ఇచ్చి అత్యంత క్రూరమైన దాడులకు పాల్పడినట్లు, ఈ దృశ్యాలను నిందితుడు సీక్రెట్ కెమెరాలు, ఫోన్‌లో రికార్డు చేసినట్లు వెల్లడించింది.