ఇంటర్మీడియట్‌లో 66.21% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇక ఫెయిల్ అయిన విద్యార్థుల సప్లిమెంటరీ పరీక్షల వివరాలను ఇంటర్ బోర్డు వెల్లడించింది. మే 24-జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని పేర్కొంది. ఫస్టియర్‌కు ఉదయం, సెకెండియర్‌కు మధ్యాహ్నం పరీక్షలు నిర్వహించనున్నారు. సప్లి ప్రాక్టికల్స్ జూన్ 5 నుంచి 9 వరకు జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తామంది. ఇవాళ్టి నుంచి మే 3లోపు పరీక్ష ఫీజు చెల్లించాలి.