ఐపీఎల్-2023లో భాగంగా నేడు చెన్నై, రాజస్థాన్ జట్లు పోటీ పడనున్నాయి. పాయింట్ల పట్టికలో ధోని సేన 10 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో ఉంది. అటు సంజూ శాంసన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రాజస్థాన్ టీమ్ 8 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుంది. మరి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.