కిడ్నీ రాకెట్ వ్యవహారంలో తిరుమల హాస్పిటల్లో విశాఖ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారుల తనిఖీలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ జగదీశ్వర్ రావు ఆస్పత్రికి చేరుకున్నారు. తిరుమల ఆసుపత్రికి అనుమతులు ఉన్నాయా.. లేవా? అనేది పరిశీలిస్తున్నామన్నారు. కిడ్నీ రాకర్ వ్యవహారం జరిగిందని సమాచారంతో ఇక్కడికి వచ్చామన్నారు. తిరుమల హాస్పిటల్లో పరిశీలన అనంతరం ప్రాథమిక నివేదిక ఇస్తామన్నారు. ప్రస్తుతం ఆస్పత్రులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయన్నారు. ఎక్కడ.. ఎప్పుడు ఏ హాస్పిటల్స్ వస్తుందో తెలియడం లేదని డీఎంఓ జగదీశ్వర్ రావు తెలిపారు.