బీసీలను ఆదుకుంటున్నామని ఎవరెన్ని కుప్పిగంతులు వేసిన బీసీలు టీడీపీ వెంటే ఉన్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం సత్తెనపల్లిలో బీసీలతో చంద్రబాబు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో సమావేశానికి బీసీ సామాజిక వర్గం నేతలు భారీగా హాజరయ్యారు. టీడీపీ హయాంలోనే తమకు న్యాయం జరిగిందని పార్టీ అధినేతకు బీసీలు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీలను వాడుకుందే తప్ప తమకేమీ చేయలేదని వాపోయారు. అనేక కార్పొరేషన్లు వేసింది గాని నిధులు లేక ఇబ్బందులు పడుతున్నామని చంద్రబాబుకు బీసీలు తెలిపారు. బీసీ కార్పొరేషన్ ఆఫీస్లో కనీసం టేబుల్, కుర్చీలు కూడా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం వేయలేదని బీసీలు తెలియజేశారు.