ఏపీలో సీపీఎస్ అమలుపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, అధ్యక్షుడు సూర్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కీలక నిర్ణయం తీసుకుందని, సీపీఎస్ అంశంపై హైకోర్టులో పిటిషన్ దాఖలుకు నిర్ణయించిందన్నారు. ఏపీలో రాజ్యాంగ, చట్టబద్ధత లేని సీపీఎస్ అంశంపై హైకోర్టుకెళ్తామన్నారు. ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ అవగాహన లేకుండా.. సీపీఎస్ రద్దుకు హామీ ఇచ్చారని బావించడం లేదని అన్నారు.