అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి ఏజెన్సీ నుంచి అక్రమంగా ఇన్నోవా వాహనం ఏపీ31ిసీక్యూ1233లో 250 కిలోల గంజాయిని బుధవారం తరలిస్తుండగా తుని రూరల్ సీఐ సన్యాసిరావు, ఎస్ఐ స్వామినాయుడు అధ్వర్యంలో మాటువేసి పట్టుకొన్నారు. దీంతో అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన కాతవరపు అరుణకుమార్ పట్టుబడ్డారు. నలుగురు పరారీలో ఉన్నారు. ఇన్నోవా వాహనంతో పాటు, పైలెట్‌గా వస్తున్న పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. తహశీల్దార్ కుమార్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.