సూడాన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి సురక్షితంగా తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కావేరి పేరుతో ప్రాజెక్ట్ చేపట్టింది. ఇందులో భాగంగా సంక్షోభంలో చిక్కుకున్న సూడాన్ నుంచి స్పెషల్ ఫ్లైట్ ఇండియాకు చేరుకుంది. తొలి స్పెషల్ ఫ్లైట్ 360 మందితో సూడాన్ నుంచి ఢిల్లీకి చేరుకుంది. తొలి ఫ్లైట్‌లో సూడాన్ నుంచి వచ్చిన వారిలో గుంటూరు జిల్లా చీరాలకు చెందిన విష్ణువర్ధన్ క్షేమంగా చేరుకున్నారు.